HBD kajal.. పెళ్లి అయిన తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చి దాదాపు సంవత్సర కాలం పాటు విశ్రాంతి తీసుకున్న కాజల్ అగర్వాల్ తాజాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ఆమె న" />

HBD Kajal: భగవంత్ కేసరి నుంచి కాజల్ లుక్ అదుర్స్..!

HBD kajal.. పెళ్లి అయిన తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చి దాదాపు సంవత్సర కాలం పాటు విశ్రాంతి తీసుకున్న కాజల్ అగర్వాల్ తాజాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ఆమె నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీ లీల బాలయ్యకు కూతురు పాత్రలో నటించబోతోంది. ఇదిలా ఉండగా ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి దర్శకనిర్మాతలు ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో చీర కట్టులో చాలా హోమ్లీగా కనిపిస్తోంది కాజల్ అగర్వాల్.

అంతేకాదు ఆమె ఒక సైకాలజీ రీసెర్చ్ కు సంబంధించిన పుస్తకాన్ని చదువుతూ ఫోన్లో మాట్లాడుతూ కళ్లద్దాలు పెట్టుకొని ఫోటోకి ఫోజు ఇచ్చిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫోటోలో ఆమె చాలా లవ్లీ గా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో కాజల్ ఎలాంటి పాత్ర పోషించనుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తుండగా.. శ్రీ లీలా కీలక పాత్ర పోషిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక దసరాకు ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న సత్యభామ సినిమాకు సంబంధించి కూడా టైటిల్, టీజర్ ను విడుదల చేయడం జరిగింది. సత్యభామ పేరుతో వస్తున్న ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ రోజుల్లో కూడా 60 చిత్రాలు పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు