Apsara Rani: కొత్త అవతారంలో బోల్డ్ బ్యూటీ..!

టాలీవుడ్ లో ఐటెం భామల కుండే క్రేజే వేరు. ఒకప్పుడు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా ఆర్టిస్టులు ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లే ఐటెం భామలుగా మారుతున్నారు. అయినప్పటికి కొంత మంది ఆర్టిస్టులు ఐటెం సాంగ్స్ ద్వారానే పాపులర్ అయ్యి, ఇప్పటికి ఐటెం సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. అలాంటి ఆర్టిస్ట్ లలో రీసెంట్ గా పాపులర్ అయిన అప్సర రాణి ఒకరు. భూమ్ బద్దలు… అంటూ క్రాక్ లో ఐటెం సాంగ్ తో కుర్రాళ్ళ మతులు పోగొట్టిన ఈ భామ అప్పట్లో తెగ హల్చల్ చేసింది.

apsara rani

ఆ తర్వాత సీటిమార్, హంట్ వంటి సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసిన ఈ భామ, ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ తో కాంట్రవర్సీ ఫోటో షూట్స్ చేసి వైరల్ అయింది. అయితే తాజాగా అప్సర రాణి మెయిన్ లీడ్ గా ఓ సినిమా రాబోతుంది. “రాచరిరం” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ లంకలపల్లి అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా, ఛిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఈశ్వర్ నిర్మిస్తున్నాడు.

అయితే ఐటెం సాంగ్ ఆర్టిస్ట్ లు హీరోయిన్లు గా చేయడం కొత్తేమి కాదు. అప్పట్లో జయమాలిని, సిల్క్ స్మిత మెయిన్ లీడ్ గా కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతెందుకు.. మొన్న మొన్నటి వరకు పాపులర్ అయిన ముమైత్ ఖాన్ తో దర్శక రత్న దాసరి నారాయణరావు కూడా మైసమ్మ ips అనే సినిమా చేసాడు. ఇక అప్సర రాణి ఇన్ని రోజులు ఐటెం గర్ల్ గా బోల్డ్ బ్యూటీ గానే పాపులర్ అవగా, ఇప్పుడు ప్రేక్షకుల నుండి మంచి రోల్స్ చేసే హీరోయిన్ గా గుర్తింపు కోసం ట్రై చేస్తున్నట్లుంది. మరి రాచరికం సినిమా అప్సర రాణి కెరీర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు