Tollywood : డైరెక్టర్లను ప్రేమించి , పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!

Tollywood: ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ప్రేమ వ్యవహారాల గురించి నిరంతరం ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంటుంది.. చాలావరకు హీరో హీరోయిన్సే ఎక్కువగా ప్రేమించుకోడం మనం ఎన్నో సందర్భాలలో వింటూనే ఉన్నాము. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్ లు.. హీరోలను కాకుండా డైరెక్టర్లను ప్రేమించి వివాహం చేసుకున్న వారు ఉన్నారు.. అయితే ఈ మధ్య ఇలాంటి వ్యవహారాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

1 . రాధిక- ప్రతాప్ పోతేన్:

అప్పట్లో హీరోయిన్ రాధిక తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. రాధిక ఎక్కువగా తమిళంలో ప్రతాప్ డైరెక్షన్లో ఎన్నో సినిమాలలో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి. మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు వివాహం చేసుకున్నారు అయితే ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది.. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ని వివాహం చేసుకుంది.

2 . అమలాపాల్-విజయ్:

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ అమలాపాల్.. కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.. అయితే కొన్ని నెలలకి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇటీవల అమలాపాల్ మరొకసారి వేరే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకొని.. ఇప్పుడు తల్లి కూడా కాబోతోంది.

tollywood

3 . మణిరత్నం -సుహాసిని:

ఇప్పటికీ కోలీవుడ్ లో ఎవర్ గ్రీన్ జంట అంటే కచ్చితంగా మణిరత్నం – సుహాసిని మాత్రమే గుర్తుకు వస్తారు.. గతంలో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుహాసిని.. డైరెక్టర్ మణిరత్నం ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

4 . రోజా -సెల్వమణి:

టాలీవుడ్ లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రోజా స్టార్ హీరోయిన్గా ఒక ఊపు ఊపేసింది. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన రోజా.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సెల్వమణి తో పరిచయం ఏర్పడి ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక పాప ,బాబు.. రోజా పొలిటికల్ పరంగా కూడా యాక్టివ్గానే ఉన్నారు.

5 . రమ్యకృష్ణ- కృష్ణవంశీ:

టాలీవుడ్ లో రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది . అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్రలేఖ సినిమాలో నటించింది. అప్పటి నుంచి వీరిద్దరు ఎక్కువగా కలుసుకోవడం వల్ల వీరి మధ్య ప్రేమ చిగురించి చివరికి ఇంట్లో వారిని ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు.. ఇప్పటికీ రమ్యకృష్ణ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు