Tollywood : ఈ హీరోయిన్లకు ఛాన్స్‌లు ఇస్తారా ?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే చాలా కష్టం. అందం, నటన మాత్రమే సరిపోదు… హీరోయిన్ గా రానించాలంటే అదృష్టం కూడా కలిసిరావాలి. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో సక్సెస్ సాధించినప్పటికీ వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి అంటే అంతే సంగతులు. వారితో సినిమాలు చేయడానికి ఎవరు ఆసక్తిని చూపించరు. ఆ సినిమాలు చూడడానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడరు. ప్రస్తుతం అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే….ఈ అమ్మడు ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించింది.

ఇండస్ట్రీలో ఈ అమ్మడు జోరు చూసి దాదాపు పదేళ్లు స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు గత సంవత్సరం 2023లో ఒక్కటంటే ఒక్క హిటి కూడా ఈ అమ్మడు ఖాతాలో పడలేదు. అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత ఈ అమ్మడు చేసిన ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్స్ గా మిగిలాయి. దీంతో ఈ అమ్మడు సినిమా అవకాశాలు లేక కాస్త సైలెంట్ అయిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో హాట్ హాట్ ఫోటోషూట్లు చేసుకుంటూ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక పూజ హెగ్డే అభిమానులు ఆ ఫోటోలను చూసి మీరు సినిమాలు చేయండి మీ వెంట మేము ఉన్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పూజ హెగ్డే దారిలోని ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఉంది. ఉప్పెన సినిమాలో తన అద్భుతమైన అందం, నటన, డైలాగ్స్ తో యూత్ ను తెగ ఆకట్టుకుంది ఈ భామ. ఉప్పెన సినిమా అనంతరం తనకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు ఖాతాలో వరుసగా ఫ్లాప్స్ మిగిలాయి. దీంతో కృతికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాగైనా రాణించాలనే ఉద్దేశంతో వరుస ఫోటోషూట్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ అమ్మడు ఖాతాలో ఏదో ఒక హిట్ పడితేనే తన కెరీర్ సక్సెస్ అవుతుంది. ఇక వీరిద్దరికీ ఏ డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు