Ananya Panday : అనన్య పాండే వాడుకుని వదిలేసిన స్టార్‌ నటుడు ?

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. అందులో కొంతమంది కష్టపడి పైకి వస్తే కొంతమంది మాత్రం వారసత్వాన్ని అందించుకొని ముందుకు సాగుతారు. అయితే వారసత్వాన్ని అందుకొని వచ్చిన హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే తనయ అనన్య పాండే.

వారసత్వంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అనన్య పాండే. ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా అనన్య పాండే బాగా పరిచయం. గత ఏడాది విడుదలైన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది హీరోయిన్ అనన్య పాండే. విజయ్ దేవరకొండ కు జంటగా గ్లామరస్ రోల్ లో అలరించింది ఈ బ్యూటీ. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్… అయింది.

దీంతో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ అనన్య పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ప్రేమలో విఫలమైనట్లు తెలిపారు. తాజాగా ఆమె నటించిన ఖో గయే హమ్ కహా సినిమా విజయం సాధించడంతో అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లవ్ ఫెయిల్యూర్ పై ఆమె స్పందించారు. ప్రేమలో విఫలం అయితే బయటపడేందుకు ప్రయత్నించాలి. అలాగే వదిలేస్తే పరిస్థితులు దారుణంగా మారుతాయి. ఆ టైంలో ఐస్ క్రీమ్ తింటూ, అర్జిత్ సింగ్, ఆషికి 2 సినిమా పాటలు వింటూ గడిపా అని చెప్పుకొచ్చారు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు